రెస్టారెంట్లో
బిర్యానీ తిని, కూల్ డ్రింక్, చల్లని నీళ్లు తాగితే అంతకంటే
హాయి ఇంకేముంటుంది చెప్పండి.. ఇది సహజంగా అందరిలోని భావన. అయితే వీటి కన్న వేడి
నీళ్లు లేదా టీ తాగడం ఉత్తమం అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. అందుకే చైనా, జపాన్ ప్రజల భోజన అలవాట్లను
చెబుతున్నారు. చైనా, జపాన్‌లో భోజనం తరువాత టీ తాగడం
లేదా వేడి నీళ్లు తాగుతారని అంటున్నారు.
చల్లని
నీళ్లు తీసుకుంటే అది మనం తిన్న ఆహార పదార్థాలలోని నూనెలతో కలసి ఉన్నజిగటైన
పదార్థాలను అలాగే ఉంచుతుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది.
కొన్ని సందర్భాలలో కొవ్వు పదార్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇదే అధిక బరువుకి, క్యాన్సర్ కు దారి తీసే అవకాశం
ఉంటుంది. అందుకే జపాన్ శాస్త్రవేత్తలు ఓ సూచన చేస్తున్నారు. ఆహారం తిన్న తరువాత
గోరు వెచ్చని నీటిని తీసుకుంటే అది పదార్థాలలోని నూనెను కరిగించి త్వరగా
జీర్ణమయ్యేలా చేస్తుందని, దీంతో గుండెపై కూడా భారం
తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు.
No comments:
Post a Comment